ఎంజీఎం ఘటనపై నన్నపునేని నరేందర్ ఆగ్రహం
ఎంజీఎం ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరత, ఓపీ చీటీలు, ఎక్స్‌రే యంత్రాలు, ల్యాబ్‌ల నిర్వహణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలపై కూడా సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.