Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గణపతికి ప్రత్యేక పూజలు.. మహా అన్నదానం

Author
Posted By Telangana Gontuka
| 23 Sep 2026, 06:49 AM | TELANGANA
గణపతికి ప్రత్యేక పూజలు.. మహా అన్నదానం

ముఖ్యమైన పాయింట్స్:

  • సహారా యూత్‌, ఆటోనగర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు

వర్ధన్నపేట: నియోజకవర్గ కేంద్రంలో సహారా యూత్‌, ఆటోనగర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందించారు.
ఈ సందర్భంగా అరూరి రమేష్‌ మాట్లాడుతూ విఘ్ననాయకుడి ఆశీస్సులతో వర్ధన్నపేట గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు, యువత భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యువత, ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.