గణపతికి ప్రత్యేక పూజలు.. మహా అన్నదానం

ముఖ్యమైన పాయింట్స్:సహారా యూత్‌, ఆటోనగర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు వర్ధన్నపేట: నియోజకవర్గ కేంద్రంలో సహారా యూత్‌, ఆటోనగర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా అరూరి రమేష్‌ మాట్లాడుతూ విఘ్ననాయకుడి ఆశీస్సులతో వర్ధన్నపేట గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు, యువత భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం...