Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వైద్య విద్యార్థిని శృతికి మాస్ సంస్థ అండ

Author
Posted By Hanumkonda
| 04 Nov 2026, 07:13 PM | TELANGANA
వైద్య విద్యార్థిని శృతికి మాస్ సంస్థ అండ

WGL : వర్ధన్నపేటకు చెందిన అన్నెపర్తి శృతి ఎంబీబీఎస్ చదువుకు మహా ఆది సేవా సంస్థ (మాస్) అండగా నిలిచింది. మొదటి, రెండో సంవత్సరం ఫీజుల కోసం ఇప్పటికే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించిన సంస్థ ప్రతినిధులు, వైద్య విద్య పూర్తయ్యే వరకు మిగతా కళాశాల ఫీజులు కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్ నాగేల్లి సామ్యేల్ సహకారంతో ఈ సాయం అందించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ సీనపల్లి విజయ్ కుమార్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మంచి వైద్యురాలిగా ఎదగాలని శృతికి సూచించారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, మాస్ సభ్యులు పాల్గొన్నారు.