Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శ్రీశైలంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు.. 834 అడుగుల స్థాయికి చేరువ

Author
Posted By Telangana Gontuka
| 02 Nov 2026, 11:20 AM | ANDHRA PRADESH, TELANGANA
శ్రీశైలంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు.. 834 అడుగుల స్థాయికి చేరువ

TG : శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు ఆందోళనకరంగా తగ్గుతున్నాయి. నవంబర్‌ 1 ఉదయానికి నీటిమట్టం 834.20 అడుగులకు, నిల్వ 54.05 టీఎంసీలకు చేరింది. విద్యుత్‌ ఉత్పత్తికి నిర్దేశించిన 834 అడుగుల స్థాయికి పైన కేవలం 0.20 టీఎంసీల నీరే మిగిలింది. ఒక్కరోజులోనే 0.60 టీఎంసీల నిల్వ తగ్గింది. కొత్తగా వస్తున్న నీటి ప్రవాహం 87 క్యూసెక్కులకే పరిమితం కాగా, వినియోగం, విడుదలలు సగటున 7,011 క్యూసెక్కులుగా నమోదయ్యాయి. ఎగువ నుంచి కొత్త ప్రవాహాలు రాకపోతే నిల్వలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో ఏపీ, తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలపై ఆందోళన నెలకొంది.