Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

‘రణబాలి’పై రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్‌.. !

Author
Posted By Telangana Gontuka
| 17 Oct 2026, 04:40 PM | ANDHRA PRADESH, Cinema, TELANGANA
‘రణబాలి’పై రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్‌.. !

TG : ‘రణబాలి’ సినిమాలో జయమ్మ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని నటి రష్మిక మందన్న ఎక్స్‌ (X) వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు. తన ప్రజల కోసం నిలబడటం, వారిని కాపాడటం, ప్రేమించడమే మహిళ అసలైన బలమని పేర్కొన్నారు. సమాజ ఐక్యత, దేవుడిపై విశ్వాసం, కష్టకాలంలోనూ చిన్న చిన్న ఆనందాలను జరుపుకోవడం, బయటి వ్యక్తులు జోక్యం చేసుకున్నప్పుడు కలిసికట్టుగా పోరాడటం వంటి అంశాలను ‘రణబాలి’ చూపిస్తుందని తెలిపారు. దర్శకుడు రాహుల్‌ సంకృత్యన్‌ కథ చెప్పే విధానాన్ని ప్రశంసిస్తూ, విజయ్‌ దేవరకొండతో పాటు చిత్రబృందం కృషిని అభినందించారు. థియేటర్లలో ఈ సినిమాను తప్పక చూడాలని ప్రేక్షకులను కోరారు. ఇప్పటికే సినిమాను చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

‘రణబాలి’పై రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్‌.. ! - Additional Image‘రణబాలి’పై రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్‌.. ! - Additional Image‘రణబాలి’పై రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్‌.. ! - Additional Image