Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఒడిశాలో విజిలెన్స్‌ తనిఖీలు.. ఇంజినీర్‌ వద్ద రూ.21.88 లక్షల నగదు స్వాధీనం

Author
Posted By Telangana Gontuka
| 17 Oct 2026, 03:33 PM | NATIONAL
ఒడిశాలో విజిలెన్స్‌ తనిఖీలు.. ఇంజినీర్‌ వద్ద రూ.21.88 లక్షల నగదు స్వాధీనం

ఒడిశాలో లంచాల వసూళ్లపై వచ్చిన సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు మహానది నార్తర్న్‌ డివిజన్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ప్రసంజిత్‌ దాస్‌ను భువనేశ్వర్‌లోని ఏజీ చౌక్‌ సమీపంలో అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న అధికారిక అద్దె వాహనంలో లెక్కలు చూపని రూ.7,28,620 నగదును గుర్తించారు. అనంతరం అద్దె నివాసంలో సోదాలు చేయగా మరో రూ.14.60 లక్షలు లభించాయి. మొత్తం రూ.21,88,620 నగదుకు సరైన లెక్కలు చూపలేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాస్‌ను అదుపులోకి తీసుకుని నగదు మూలాలపై విచారిస్తున్నారు. ఈ ఘటనపై భువనేశ్వర్‌ విజిలెన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.