Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కడప, పులివెందులలో ఉద్రిక్తత.. నామినేషన్‌ కేంద్రాల వద్ద ఘర్షణలు

Author
Posted By Telangana Gontuka
| 17 Oct 2026, 02:25 PM | ANDHRA PRADESH
కడప, పులివెందులలో ఉద్రిక్తత.. నామినేషన్‌ కేంద్రాల వద్ద ఘర్షణలు

కడప : స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. కడప నగరంలోని కాగితాలపెంట, నాగరాజుపేట, సెయింట్‌ జోసెఫ్‌ నామినేషన్‌ కేంద్రాలతో పాటు గాంధీనగర్‌ పాఠశాల ప్రాంతంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. పులివెందులలోనూ నామినేషన్‌ కేంద్రం వద్ద గొడవ జరిగినట్లు సమాచారం. అక్కడ పోలీసులు కాల్పులు జరిపారని, ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారని వార్తలు వెలువడ్డాయి. ఘటనలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.