Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మహిళా రైతులకు చట్టబద్ధ గుర్తింపు కల్పించాలి..!

Author
Posted By Telangana Gontuka
| 15 Oct 2026, 12:29 PM | Politics, TELANGANA
మహిళా రైతులకు చట్టబద్ధ గుర్తింపు కల్పించాలి..!

TG : వ్యవసాయమే గ్రామీణ మహిళలకు జీవనాధారం. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు పొలాల్లో, అనుబంధ రంగాల్లో మహిళలు శ్రమిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న మహిళా రైతుల కష్టానికి తగిన గుర్తింపు లేకపోవడం బాధాకరం. మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా వారి శ్రమను గుర్తించి గౌరవించాలి. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రైతుల సాధికారత చట్టం–2026 స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కూడా చట్టం తీసుకురావాలి. మహిళా రైతులు, వ్యవసాయ కూలీలకు చట్టబద్ధ గుర్తింపుతో పాటు ప్రభుత్వ పథకాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలి. ఈ మేరకు అసెంబ్లీ, మండలిలో చట్టాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.