Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యుత్‌ కోతలపై సీఎం ఆగ్రహం.. ఉన్నతాధికారుల సస్పెన్షన్‌కు హెచ్చరిక!

Author
Posted By Telangana Gontuka
| 15 Oct 2026, 11:27 AM | Politics, TELANGANA
విద్యుత్‌ కోతలపై సీఎం ఆగ్రహం.. ఉన్నతాధికారుల సస్పెన్షన్‌కు హెచ్చరిక!

తెలంగాణలో తరచూ విద్యుత్‌ కోతలు, సరఫరాలో అంతరాయాలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా మెరుగుపడకపోతే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, TG Genco సీఎండీ ఎస్‌.హరీశ్‌ సహా బాధ్యులైన ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. విద్యుత్‌ సరఫరాపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ముందస్తుగా ఉత్పత్తిని ఎందుకు పెంచలేదని అధికారులను ప్రశ్నించారు. నైనీ, మహానది బొగ్గు సరఫరా ఏర్పాట్లు చేసినా యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పూర్తి సామర్థ్యంతో ఎందుకు పనిచేయడం లేదని నిలదీశారు. రైతుల పంటలకు, వ్యవసాయ పనులకు అవసరమైన విద్యుత్‌ అందించాలని ఆదేశించారు. కోతలకు కారణాలను వెంటనే గుర్తించి, సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్లక్ష్యాన్ని సహించబోనని హెచ్చరించారు.