Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఉప్పల్‌లో ఎర్టిగా కారులో మంటలు

Author
Posted By Telangana Gontuka
| 15 Oct 2026, 11:19 AM | TELANGANA
ఉప్పల్‌లో ఎర్టిగా కారులో మంటలు

హైదరాబాద్‌: ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పార్క్‌ చేసి ఉన్న ఎర్టిగా వాహనంలో మంటలు చెలరేగాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వాహనం ఇంజిన్‌ భాగం చాలావరకు దగ్ధమైనట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.