Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు

Author
Posted By Marupatla venu
| 13 Oct 2026, 07:55 AM | TELANGANA
ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు

జఫర్‌గఢ్: అక్టోబర్ 12 (తెలంగాణ గొంతుక) ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసే లక్ష్యంతో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ ఇంచార్జిలు, మండల సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశమై నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా మండలంలో ఇప్పటివరకు 40 శాతం పట్టభద్రుల ఓటర్ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు కమిటీ నాయకులు వెల్లడించారు. మిగిలిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, కొత్త ఓటర్ల నమోదుపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలు, నమోదు సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై డా. తాటికొండ రాజయ్య ఇంచార్జిలు, కమిటీ సభ్యులకు వివరించారు. అర్హులైన పట్టభద్రులందరి నమోదు పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచనలు అందజేశారు.పట్టభద్రుల ఓటర్ రిజిస్ట్రేషన్ లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు సంబంధిత నాయకులు, ఇంచార్జిలు సమిష్టిగా కృషి చేయాలని ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.