Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భద్రకాళి ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

Author
Posted By Telangana Gontuka
| 11 Oct 2026, 06:17 AM | Bhakti, TELANGANA
భద్రకాళి ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

వరంగల్‌: చారిత్రక భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి, దసరా మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం కలశ స్థాపన, ధ్వజారోహణం, భేరీ పూజతో ఉత్సవాలు మొదలవుతాయని ప్రధానార్చకులు భద్రకాళి శేషు తెలిపారు. లోకకల్యాణం కోసం శతచండీ, మహారుద్ర, లక్ష్మీ, దుర్గా, గణేశ, సరస్వతి, సుదర్శన యాగాలతో పాటు వేద పారాయణం నిర్వహించనున్నారు. తొలి రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. నవరాత్రుల్లో ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు, పూజలు, వాహన సేవలు నిర్వహిస్తారు. 18న మహాష్టమి, సద్దుల బతుకమ్మ, 19న మహానవమి, 20న విజయదశమి సందర్భంగా మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 21న భద్రకాళి భద్రేశ్వరుల శాంతి కల్యాణం జరగనుంది. భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం అందించనున్నారు.