Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చిన్నారుల సందడితో అంగన్వాడీలో బతుకమ్మ కోలాహలం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన

Author
Posted By satla anil kumar
| 09 Oct 2026, 06:03 PM | TELANGANA
చిన్నారుల సందడితో అంగన్వాడీలో బతుకమ్మ కోలాహలం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన

వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామ అంగన్వాడీ కేంద్రం–3లో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
పండుగ విశిష్టతను తెలిపిన టీచర్
పండుగ వాతావరణంలో నిర్వహించిన వేడుకలతో అంగన్వాడీ కేంద్రం కళకళలాడింది. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను చిన్నారులకు వివరిస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మాధవి, ఆయా కవిత పాల్గొన్నారు.

చిన్నారుల సందడితో అంగన్వాడీలో బతుకమ్మ కోలాహలం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన - Additional Image