Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

Author
Posted By Telangana Gontuka
| 08 Oct 2026, 03:08 PM | ANDHRA PRADESH
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

అమరావతి: పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌కు రూ.20.62 కోట్ల ప్రతిపాదనకు చర్చ జరిగింది. సర్వీసులో మృతి చెందిన ఆశా వర్కర్లకు ప్రతి ఏడాదికి రూ.5 వేల చొప్పున, గరిష్ఠంగా రూ.1.50 లక్షల గ్రాట్యుటీ చెల్లించే ప్రతిపాదన ఉంది. రేపల్లె 30 పడకల సీహెచ్‌సీని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. గిరిజన విద్యార్థులకు IIT-JEE, NEET కోచింగ్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌లకు ఏపీ పాలసీ-2026పై చర్చించారు. పట్టణ గృహ సమస్యల పరిష్కారానికి ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు.