Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బాల్యమిత్రురాలికి ఆర్థిక భరోసా

Author
Posted By Hanumkonda
| 08 Oct 2026, 07:46 AM | TELANGANA
బాల్యమిత్రురాలికి ఆర్థిక భరోసా

వర్ధన్నపేట : మండలంలోని నల్లబెల్లి గ్రామానికి చెందిన బిర్రు నర్సయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన మూడో కుమార్తె సునీత చిన్ననాటి స్నేహితులు, జెడ్పీహెచ్‌ఎస్‌ నల్లబెల్లి 1988-89 పదో తరగతి పూర్వ విద్యార్థుల సేవా నిధి మిత్రబృందం సభ్యులు బుధవారం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ పరిస్థితులను తెలుసుకుని సునీతకు ₹10 వేల ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. బాల్య స్నేహాన్ని సేవా స్ఫూర్తిగా మలుస్తూ కష్టాల్లో ఉన్న మిత్రురాలికి చేయూతనివ్వడంపై పలువురు అభినందించారు. కార్యక్రమంలో గోలి కొమురయ్య, గజ్జల శ్రీనివాస్, ఆరెల్లి శ్రీనివాస్, ముత్యం సంపత్, బిర్రు గోపాల్, వర్కాల సుధాకర్, మాలో సుందర్, తంగేళ్ల యాదగిరి, చిరునోముల కృష్ణ, బిర్రు పూలమ్మ, ఎండీ అబ్దుల్‌ నబీ, బిర్రు దయాకర్, మాజీ వార్డు సభ్యుడు బిర్రు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.