Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పాత జాబితాలో పేరున్నా.. మళ్లీ దరఖాస్తు తప్పనిసరి

Author
Posted By Telangana Gontuka
| 07 Oct 2026, 09:03 PM | TELANGANA
పాత జాబితాలో పేరున్నా.. మళ్లీ దరఖాస్తు తప్పనిసరి

వరంగల్: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరిష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 01-11-2023 నాటికి కనీసం మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా ఏఈఆర్‌ఓలు లేదా నియమిత అధికారులకు దరఖాస్తు చేయాలని సూచించారు. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను జత చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో సీఈవో తెలంగాణ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పాత ఓటరు జాబితాలో పేరు ఉన్నా ప్రస్తుత ప్రక్రియలో నిర్దేశిత విధానంలో తిరిగి దరఖాస్తు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.