Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ధనుష్‌ రాజకీయ రంగప్రవేశం.. కొత్త పార్టీపై జోరుగా ప్రచారం!

Author
Posted By Telangana Gontuka
| 07 Oct 2026, 09:00 PM | TELANGANA
ధనుష్‌ రాజకీయ రంగప్రవేశం.. కొత్త పార్టీపై జోరుగా ప్రచారం!

చెన్నై: తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం తమిళనాట హాట్‌టాపిక్‌గా మారింది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తమిళ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ పేరును ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ధనుష్‌ వర్గం మాత్రం పార్టీ ప్రారంభం ఖాయమేనని, కానీ పార్టీ పేరు ఇంకా ఎన్నికల సంఘంలో నమోదు కాలేదని స్పష్టం చేసినట్లు మరో కథనం వెల్లడించింది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే అభిమాన సంఘాలను బలోపేతం చేయడంతో పాటు సేవా కార్యక్రమాలపై ధనుష్‌ దృష్టి సారించడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది.