Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జర్నలిజంపై జులుం నడవదు.. ఎమ్మెల్యే ఖబర్దార్‌!

Author
Posted By Telangana Gontuka
| 07 Oct 2026, 08:34 PM | TELANGANA
జర్నలిజంపై జులుం నడవదు.. ఎమ్మెల్యే ఖబర్దార్‌!

వరంగల్‌ : మీడియా సంస్థ దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా జర్నలిస్టులు వరంగల్‌ పోచమ్మమైదాన్‌ కూడలిలో రోడ్డుపై బైఠాయించి నల్లబ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. ప్రశ్నించే నాలుగో స్తంభంపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌. నాగరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే నాలుగుసార్లు జరిగాయని వరంగల్‌ తూర్పు పరపతి సంఘం అధ్యక్షుడు నరేందర్‌ ఆరోపించారు. వార్తలపై అభ్యంతరాలుంటే చట్టబద్ధమైన మార్గాలను ఆశ్రయించాలే తప్ప దిష్టిబొమ్మలు దహనం చేయడం ప్రజాస్వామ్య సంప్రదాయం కాదని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.