Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అమరుల త్యాగాలను రాజకీయాలకు వాడుకోవద్దు

Author
Posted By Telangana Gontuka
| 07 Oct 2026, 07:55 PM | Politics, TELANGANA
అమరుల త్యాగాలను రాజకీయాలకు వాడుకోవద్దు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో పలువురు అమరులు కావడానికి కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఉద్యమానికి మద్దతుగా నిలవకపోవడమే కారణమని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ఆరోపించారు. అమరవీరుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. అమరులపై నిజమైన ప్రేమ ఉంటే ఫోర్త్‌ సిటీలో లేదా హైదరాబాద్‌లో వారికి భూములు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతిపక్షాలపై కేసులు, ఢిల్లీకి సూట్‌కేసుల రాజకీయాలు సాగుతున్నాయని విమర్శించారు. ఇది వేధింపులు, సాధింపుల పాలనగా మారిందని దేశపతి శ్రీనివాస్‌ ఆరోపించారు.