Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బాధిత యువతికి ఆరూరి రమేష్ సంఘీభావం

Author
Posted By satla anil kumar
| 07 Oct 2026, 11:13 AM | Array
బాధిత యువతికి ఆరూరి రమేష్ సంఘీభావం

వర్ధన్నపేట :
ప్రేమ పేరుతో తనను మోసం చేశారంటూ ఆందోళన చేస్తున్న యువతికి బీఆర్ఎస్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సంఘీభావం తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడిపై యువతి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమె చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఛైర్మన్ ఇంటి ఎదుట యువతి బైఠాయించింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని ఆమెకు మద్దతు తెలిపారు. బాధితురాలి సమస్యను అధికారులు సీరియస్‌గా తీసుకుని సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరారు. యువతి చేస్తున్న ఆరోపణలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తానని యువతి స్పష్టం చేసింది. ఈ వ్యవహారం వర్ధన్నపేటలో చర్చనీయాంశంగా మారింది.

బాధిత యువతికి ఆరూరి రమేష్ సంఘీభావం  - Additional Imageబాధిత యువతికి ఆరూరి రమేష్ సంఘీభావం  - Additional Image