Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మార్కెట్‌ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కోరం కనకయ్య సమీక్ష

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 07:10 PM | TELANGANA
మార్కెట్‌ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కోరం కనకయ్య సమీక్ష

ఇల్లందు: మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో చైర్మన్‌ బానోత్‌ రాంబాబు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్యఅతిథిగా హాజరై 2025–26 మార్కెట్‌ ఆదాయ, వ్యయాలపై సమీక్షించారు. టేకులపల్లి సబ్‌యార్డు, మార్కెట్‌ కార్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కామేపల్లి మండలంలో నూతన సబ్‌యార్డు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సమావేశంలో వైస్‌చైర్మన్‌ బిజ్జా వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్‌ మెట్ల రామకృష్ణ, పాలకవర్గ సభ్యులు, మార్కెట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.