Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నకిలీ పీజీ పట్టాలు.. 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 01:49 PM | TELANGANA
నకిలీ పీజీ పట్టాలు.. 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు

హైదరాబాద్‌: నకిలీ పీజీ సర్టిఫికెట్లతో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు పొందినట్లు తేలిన 35 మందిపై ప్రభుత్వం వేటు వేసింది. షోకాజ్‌ నోటీసులు జారీ చేసినప్పటికీ సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2014కు ముందు కాంట్రాక్ట్‌ లెక్చరర్లుగా పనిచేస్తున్న సుమారు 3,300 మందిని 2023లో రెగ్యులరైజ్‌ చేశారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాల్లోని 16 యూనివర్సిటీలకు చెందిన పీజీ ధ్రువపత్రాలను సమర్పించారు. వాటి ప్రామాణికతపై ఇంటర్‌ బోర్డు అధికారులు స్వయంగా ఆయా వర్సిటీలను సందర్శించి పరిశీలించగా.. 35 మంది సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని తేలినట్లు అధికారులు గుర్తించారు. దీంతో నోటీసుల అనంతరం తాజాగా ఉద్యోగాల నుంచి తొలగించారు.