Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పండుగల వేళ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 01:18 PM | TELANGANA
పండుగల వేళ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

వర్ధన్నపేట: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని పట్టణంలో పారిశుద్ధ్యం, విద్యుత్‌ దీపాల ఏర్పాట్లపై మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పండుగలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. బతుకమ్మ, దసరా వేడుకలు జరిగే ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అవసరమైన చోట అదనపు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పండుగ రోజుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి, కార్యక్రమాలు ముగిసిన వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు కరుణాకర్‌, ఐలయ్య, రితీష్‌, గోపి, సిబ్బంది పాల్గొన్నారు.