Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వనపర్తికి చేరిన తీన్మార్‌ మల్లన్న పాదయాత్ర

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 12:56 PM | Politics, TELANGANA
వనపర్తికి చేరిన తీన్మార్‌ మల్లన్న పాదయాత్ర

వనపర్తి: బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్‌ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర మంగళవారం వనపర్తి జిల్లాకు చేరుకుంది. పెబ్బేరు నుంచి వనపర్తి వైపు కొనసాగిన పాదయాత్రకు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మల్లన్నతో కలిసి బీసీ వర్గాలకు చెందిన పలువురు ప్రజలు, నాయకులు అడుగులు వేశారు. హమాలీ కూలీలు సైతం యాత్రకు సంఘీభావం ప్రకటించి తమ సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకెళ్లారు. కష్టజీవుల సమస్యల పరిష్కారంతో పాటు బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. మార్గమధ్యంలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ మల్లన్న యాత్రను కొనసాగించారు.