Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్లాస్టిక్‌ నోట్లకు ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్‌!

Author
Posted By Telangana Gontuka
| 06 Oct 2026, 12:00 PM | INTERNATIONAL, NATIONAL
ప్లాస్టిక్‌ నోట్లకు ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్‌!

న్యూఢిల్లీ: దేశంలో ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా ఆర్బీఐ కీలక అడుగు వేసింది. తొలిదశలో రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్‌ నోట్లపై ఫీల్డ్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక మెటీరియల్‌ సరఫరా చేయగల అర్హత కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆర్బీఐ అనుబంధ సంస్థ బీఆర్‌బీఎన్‌ఎంపీఎల్‌ ఆహ్వానించింది. కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్‌ నోట్లు ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది. చిన్న నోట్లు త్వరగా చిరిగిపోవడం, పాడవడం వంటి సమస్యలకు పరిష్కారం లభించవచ్చని భావిస్తున్నారు. 2012లోనూ ఈ తరహా ప్రయోగాలు జరిగినా సాంకేతిక సమస్యలతో ముందుకు సాగలేదు. తాజా సాంకేతికతతో ప్రాజెక్టును మరోసారి పరిశీలిస్తున్నారు.