Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

Author
Posted By Telangana Gontuka
| 05 Oct 2026, 12:58 PM | TELANGANA
పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పశువులను క్రూరంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పరుపల్లి క్రాస్‌రోడ్డు వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో TS-21T-9507 నంబర్‌ గల అశోక్‌ లేలాండ్‌ వాహనంలో 9 ఎద్దులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో కొరుట్లకు చెందిన డ్రైవర్‌ కమ్‌ యజమాని మొహమ్మద్‌ ముబీన్‌ బాబా (69), వ్యాపారి అబ్దుల్‌ హమీద్‌ (32)పై కేసు నమోదు చేశారు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టారు. ఎస్సై రాజశేఖర్‌ వివరాలు వెల్లడించారు.