Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

Author
Posted By Telangana Gontuka
| 05 Oct 2026, 12:52 PM | ANDHRA PRADESH
సీఎం పర్యటన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రొద్దుటూరు పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి ఉన్నతస్థాయి సమీక్షలో పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సభా ప్రాంగణం, ట్రాఫిక్‌, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సీఎం పర్యటన విజయవంతమయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌, జేసీ నిధిమీనా తదితరులు పాల్గొన్నారు.