Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అకాల మరణం బాధాకరం.. ప్రజా సేవలు చిరస్మరణీయం: కేఆర్‌ నాగరాజు

Author
Posted By Hanumkonda
| 05 Oct 2026, 12:36 PM | TELANGANA
అకాల మరణం బాధాకరం.. ప్రజా సేవలు చిరస్మరణీయం: కేఆర్‌ నాగరాజు

హన్మకొండ: మాజీ కార్పొరేటర్‌ కానుగంటి శేఖర్‌ ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి మృతి చెందడం తీవ్ర విషాదకరమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కేఆర్‌ నాగరాజు అన్నారు. శేఖర్‌ మృతి విషయం తెలుసుకున్న ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా జీవితంలో శేఖర్‌ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ విషాద సమయంలో శేఖర్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.