32 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటైన 1994–95 బ్యాచ్ జెడ్పీఎస్‌ఎస్‌ ఇల్లందలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న నాటి సహపాఠులు

ఇల్లంద,: కాలం మారినా.. దూరాలు పెరిగినా.. చిన్ననాటి స్నేహాలకు వయసు అడ్డుకాదని 1994–95 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు చాటిచెప్పారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత నాటి సహపాఠులంతా ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకోవడంతో జెడ్పీఎస్‌ఎస్‌ ఇల్లంద పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి బ్యాచ్‌కు చెందిన పలువురు హాజరై నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకే తరగతి గది.. ఒకే బెంచీలు.. గురువుల బోధనలు.. కలిసి చేసిన అల్లరి.. ఆటపాటలు.. స్నేహబంధాలను గుర్తుచేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందాన్ని పంచుకున్నారు. అప్పట్లో విద్యార్థులుగా ఉన్న వారు ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడి తమ జీవిత ప్రస్థానాన్ని పరస్పరం పంచుకున్నారు....