Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రశ్నించే గొంతుకలకు బలం ఇవ్వండి: అరూరి రమేష్‌

Author
Posted By Hanumkonda
| 03 Oct 2026, 05:06 PM | Politics, TELANGANA
ప్రశ్నించే గొంతుకలకు బలం ఇవ్వండి: అరూరి రమేష్‌

ముఖ్యమైన పాయింట్స్:

  • ఎమ్మెల్సీ ఓటరు నమోదు, ఎస్‌ఐఆర్‌, సోషల్‌ మీడియా వారియర్స్‌తో సమావేశం

వర్ధన్నపేట: హెచ్‌ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌లో వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ, ఎస్‌ఐఆర్‌, సోషల్‌ మీడియా వారియర్స్‌తో బీఆర్‌ఎస్‌ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్‌ క్యాలెండర్‌ హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజలు తమకు బలం ఇవ్వాలని కోరారు. అనంతరం ఏనుగుల రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరాడుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.