Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన మామునూర్‌లో అవగాహన సదస్సు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి హాజరు

Author
Posted By satla anil kumar
| 03 Oct 2026, 12:32 PM | TELANGANA
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన మామునూర్‌లో అవగాహన సదస్సు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి హాజరు

వరంగల్ జిల్లా, అక్టోబర్ 3: ఖిలా వరంగల్ మండలం మామునూర్ కేంద్రంగా వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి పాల్గొన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునే విధానం, అవసరమైన అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన మామునూర్‌లో అవగాహన సదస్సు.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి హాజరు - Additional Image