Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భారత్‌తో చారిత్రక మ్యాచ్‌కు బ్రెజిల్‌ సిద్ధం

Author
Posted By Hanumkonda
| 03 Oct 2026, 11:02 AM | INTERNATIONAL, NATIONAL, Sports
భారత్‌తో చారిత్రక మ్యాచ్‌కు బ్రెజిల్‌ సిద్ధం

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక సమరం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని వివేకానంద యువభారతి క్రీడాంగణం (సాల్ట్‌లేక్‌ స్టేడియం)లో శనివారం భారత్‌, ఐదుసార్లు ప్రపంచకప్‌ విజేత బ్రెజిల్‌ జట్లు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో తలపడనున్నాయి. భారత గడ్డపై బ్రెజిల్‌ సీనియర్‌ పురుషుల జట్టు ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఇదే కావడంతో ఈ పోరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్‌ ఐదో స్థానంలో ఉండగా, భారత్‌ 138వ స్థానంలో ఉంది. బ్రెజిల్‌ జట్టుకు ప్రముఖ కోచ్‌ కార్లో అన్సెలొట్టి నాయకత్వం వహిస్తున్నారు. వినీసియస్‌ జూనియర్‌, ఎండ్రిక్‌, రఫిన్హా వంటి స్టార్‌ ఆటగాళ్లతో కూడిన బ్రెజిల్‌ జట్టు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకుంది. నగరంలో బ్రెజిల్‌ అభిమానుల సందడి నెలకొంది.
మ్యాచ్‌కు ముందు సాల్ట్‌లేక్‌ స్టేడియం పిచ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా పనులు చేపట్టారు. బ్రెజిల్‌ నుంచి వచ్చిన టర్ఫ్‌ నిపుణులు స్థానిక గ్రౌండ్స్‌ సిబ్బందితో కలిసి పిచ్‌ సంరక్షణ పనులు నిర్వహించారు. భారత జట్టు కోచ్‌ ఖలీద్‌ జమీల్‌ నేతృత్వంలో సవాల్‌కు సిద్ధమైంది. మ్యాచ్‌ శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది