Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వైభవ్‌ సూర్యవంశి ఔట్‌.. 15 పరుగులతో వెనుదిరిగిన యువ సంచలనం

వైభవ్‌ సూర్యవంశి ఔట్‌.. 15 పరుగులతో వెనుదిరిగిన యువ సంచలనం

నిశిన్‌: ఆసియా క్రీడలు–2026 పురుషుల క్రికెట్‌ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న స్వర్ణ పతక పోరులో భారత యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశి మెరుపు ఆరంభం ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు సూర్యవంశి, అభిషేక్‌ శర్మ మంచి ఆరంభాన్ని అందించారు. కేవలం 9 బంతుల్లో 15 పరుగులు చేసిన వైభవ్‌.. రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అయితే రెండో ఓవర్‌ తొలి బంతికి సైమ్‌ అయూబ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి క్యాచ్‌ వెనుకకు ఇచ్చి ఔటయ్యాడు. ఉస్మాన్‌ ఖాన్‌ క్యాచ్‌ అందుకోవడంతో భారత తొలి వికెట్‌ 28 పరుగుల వద్ద పడింది. వైభవ్‌ ఔటైనప్పటికీ అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడుతూ భారత స్కోరును వేగంగా పెంచుతున్నాడు. 3.1 ఓవర్లకు భారత్‌ 44/1తో కొనసాగుతోంది. అభిషేక్‌ 9 బంతుల్లో 25 పరుగులతో క్రీజులో ఉండగా, సంజు శాంసన్‌ అతడికి జతగా ఉన్నాడు. అంతకుముందు శ్రీలంకతో సెమీఫైనల్లో వైభవ్‌ 21 బంతుల్లో 38 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.