Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హైదరాబాద్‌ హోటళ్లలో వరుస విషాదాలు.. భద్రతపై ప్రశ్నలు

Author
Posted By Telangana Gontuka
| 03 Oct 2026, 10:05 AM | Crime, TELANGANA
హైదరాబాద్‌ హోటళ్లలో వరుస విషాదాలు.. భద్రతపై ప్రశ్నలు

హైదరాబాద్‌: నగరంలోని హోటళ్లలో ఇటీవల వరుసగా యువతులు మృతి చెందిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సెప్టెంబర్‌ 21న మాదాపూర్‌లో షారోన్‌ నిఖిత మృతి కేసు హత్య కేసుగా మారగా, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్‌ 29న ఎస్‌ఆర్‌ నగర్‌లో బి.శిరీష హత్యకు గురైంది. అక్టోబర్‌ 2న మియాపూర్‌ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని కోమటి సృజన మృతదేహం లభ్యమైంది. వరుస ఘటనల నేపథ్యంలో హోటళ్లలో అతిథుల వివరాల ధ్రువీకరణ, సీసీ కెమెరాల నిర్వహణ, అనుమానాస్పద కదలికలపై నిఘా వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హోటళ్లపై ప్రత్యేక తనిఖీలు, భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.