Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

యుద్ధాల ముగింపుపై మోదీ ఆలోచనలు అద్భుతం: పుతిన్

యుద్ధాల ముగింపుపై మోదీ ఆలోచనలు అద్భుతం: పుతిన్

మాస్కో: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రధాని మోదీకి మంచి ఆలోచనలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. వాల్డాయ్‌ ఇంటర్నేషనల్‌ డిస్కషన్‌ క్లబ్‌ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సమావేశాల్లో మోదీ ప్రతిసారీ ఉక్రెయిన్‌ సంఘర్షణ ముగింపు అంశాన్ని ప్రస్తావిస్తారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారానికి మోదీ సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు. భారత సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యతను కూడా పుతిన్‌ ప్రశంసించారు.