Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పీఎం శ్రీ స్కూళ్లలో ప్రత్యేక టీచర్ల నియామకాలు

Author
Posted By Hanumkonda
| 03 Oct 2026, 08:24 AM | TELANGANA
పీఎం శ్రీ స్కూళ్లలో ప్రత్యేక టీచర్ల నియామకాలు

Warangal : పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం గెస్ట్‌ ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులను తాత్కాలికంగా నియమించేందుకు సమగ్ర శిక్ష మార్గదర్శకాలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 79 పాఠశాలల్లో 79 మంది టీచర్లను ఐదు నెలల పాటు నియమించనున్నారు. ఒక్కో టీచర్‌కు నెలకు రూ.16,500, ఐదు నెలలకు రూ.82,500 గౌరవ వేతనం చెల్లిస్తారు. హనుమకొండలో 16, వరంగల్‌ 14, జనగామ 14, ములుగు 7, మహబూబాబాద్‌ 21, భూపాలపల్లి 7 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం రూ.65.17 లక్షలు కేటాయించారు.