Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మామునూరు ఎయిర్‌పోర్టుకు మరో ముందడుగు!

Author
Posted By Hanumkonda
| 03 Oct 2026, 08:17 AM | NATIONAL, TELANGANA
మామునూరు ఎయిర్‌పోర్టుకు మరో ముందడుగు!

ముఖ్యమైన పాయింట్స్:

  • ఈ నెల 15 నుంచి బౌండరీ వాల్‌ పనులు.. రూ.13.28 కోట్లతో వర్క్‌ ఆర్డర్‌

వరంగల్‌: మామునూరు విమానాశ్రయ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఈ నెల 15 నుంచి బౌండరీ వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. కొత్తగా సేకరించిన భూమి చుట్టూ ప్రీ-కాస్ట్‌ ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు, ఉన్న గోడ ఎత్తును పెంచేందుకు ఏఏఐ చర్యలు చేపట్టింది. రూ.13.28 కోట్లకు సైడాక్స్‌ ఇంజనీర్స్‌ సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ జారీ చేసింది. పనులను 15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. రూ.21.39 కోట్ల అంచనా వ్యయం కంటే 37.89 శాతం తక్కువకు టెండర్‌ దక్కింది. కొత్త టెర్మినల్‌, ఏటీసీ టవర్‌, ఫైర్‌ స్టేషన్‌ తదితర పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.