Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి

Author
Posted By Telangana Gontuka
| 02 Oct 2026, 12:03 PM | TELANGANA
గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి

హన్మకొండ: పరకాల పట్టణంలోని అమరవీరుల మైదానం (స్మారక భవనం) చాపలబండలో నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవ మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటిని ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజంలో శాంతి, ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి - Additional Image