Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గాంధీ జయంతి సందర్భంగా ఎర్రబెల్లి ఘన నివాళులు

Author
Posted By Telangana Gontuka
| 02 Oct 2026, 11:51 AM | TELANGANA
గాంధీ జయంతి సందర్భంగా ఎర్రబెల్లి ఘన నివాళులు

జనగాం:జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాట నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
గాంధీజీ ఆశయాలను ప్రజలు ఆచరించాలని, సమాజంలో శాంతి, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా ఎర్రబెల్లి ఘన నివాళులు - Additional Image