Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భారీ ఆస్తులు ఎలా వచ్చాయి.. కేటీఆర్‌ను ప్రశ్నించిన సాంబయ్య

Author
Posted By Telangana Gontuka
| 02 Oct 2026, 09:31 AM | TELANGANA
భారీ ఆస్తులు ఎలా వచ్చాయి.. కేటీఆర్‌ను ప్రశ్నించిన సాంబయ్య

వరంగల్: సామాన్యులు చిన్న ఇల్లు నిర్మించుకోవాలన్నా, చిన్న వ్యాపారం ప్రారంభించుకోవాలన్నా అనేక నిబంధనలు, అనుమతులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రాయపురం సాంబయ్య అన్నారు. శుక్రవారం శివనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఉద్దేశించి సాంబయ్య పలు ప్రశ్నలు సంధించారు. సామాన్యులు చిన్న నిర్మాణం చేపట్టాలన్నా అధికారులు నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని, అదే సమయంలో వందలాది గదులతో హోటళ్లు, వేలాది ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు, భారీ అపార్ట్‌మెంట్లు ఎలా ఏర్పడ్డాయని ప్రశ్నించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారని కేటీఆర్‌పై సాంబయ్య ఆరోపణలు చేశారు. సామాన్య ప్రజలకు ఒక న్యాయం, అధికారంలో ఉన్న వారికి మరో న్యాయం ఉండకూడదన్నారు. భారీ ఆస్తుల సమీకరణపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్‌ చేశారు.