Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

25 ఎకరాలు పంచారు.. చివరకు ముద్ద అన్నానికీ నోచుకోలేదు!

25 ఎకరాలు పంచారు.. చివరకు ముద్ద అన్నానికీ నోచుకోలేదు!

సంగారెడ్డి: కన్న కొడుకులను పెంచి పెద్ద చేసి, 25 ఎకరాల భూమి, ఇంటిని ముగ్గురు కుమారులకు పంచిన వృద్ధ దంపతులు చివరకు తిండికి ఇబ్బందులు పడి బావిలో దూకి ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన నారాయణఖేడ్‌ మండలం చాప్టా(కే)లో జరిగింది. నర్సారెడ్డి(88), అంజమ్మ(85) దంపతులను కుమారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. బతుకుదెరువు కోసం రెండెకరాలు ఇవ్వాలని కోరినా ఫలితం లేకపోయిందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.