Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సంపత్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Author
Posted By Telangana Gontuka
| 01 Oct 2026, 05:23 PM | TELANGANA
సంపత్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో సెప్టెంబర్‌ 17న జరిగిన పెండెల సంపత్‌ హత్య కేసును గణపురం పోలీసులు ఛేదించారు. భార్య సుమలతతో ఉన్న సంబంధాన్ని సంపత్‌ అనుమానించి శ్రీకాంత్‌ను పలుమార్లు హెచ్చరించడంతో అతడిని హతమార్చేందుకు పథకం వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో ఉమ్మల్ల శ్రీకాంత్‌, మృతుడి భార్య పెండెల సుమలత, పొలుదాసరి తరుణ్‌లను అరెస్టు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. వారి నుంచి ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు, రూ.500 నగదు, మద్యం సీసా, పురుగుల మందు సీసాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు గణపురం పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు.

సంపత్ హత్య కేసును ఛేదించిన పోలీసులు - Additional Image