Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని కలిసిన చాడ మరియా

Author
Posted By Telangana Gontuka
| 01 Oct 2026, 08:26 AM | TELANGANA
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని కలిసిన చాడ మరియా

వరంగల్‌:తెలంగాణ టీడీపీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి చాడ మరియా (సురేఖ) ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్–మామునూరు విమానాశ్రయ అభివృద్ధి, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వరంగల్ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ కమిటీ సభ్యులు, ఏడు నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని కోరుతూ మంత్రికి మెమోరాండం అందజేశారు.
మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రికి వరంగల్ టీడీపీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీ భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని మంత్రికి అందజేసి శాలువాతో సత్కరించారు. వరంగల్ ప్రాంత అభివృద్ధి, మామునూరు విమానాశ్రయం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై కూడా చర్చించారు. టీడీపీ నాయకులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు చాడ మరియా తెలిపారు.