Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పీఎం సూర్యఘర్‌పై అవగాహన శిబిరం

Author
Posted By Hanumkonda
| 30 Sep 2026, 06:23 PM | TELANGANA
పీఎం సూర్యఘర్‌పై అవగాహన శిబిరం

వరంగల్‌ : పీఎం సూర్యఘర్‌–ముఫ్త్‌ బిజ్లీ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్‌ 1 నుంచి మూడు రోజుల పాటు సేవా సేతు అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు వరంగల్‌ గ్రామీణ డీఈ బి.దానయ్య, జిల్లా మేనేజర్‌ రాజేందర్‌ తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ 1న వర్ధన్నపేట విద్యుత్‌ ఉపవిభాగం కార్యాలయంలో శిబిరం నిర్వహించనున్నారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం, విద్యుత్‌ బిల్లుల తగ్గింపు, నెట్‌ మీటరింగ్‌, బ్యాంకు రుణ సౌకర్యాలపై అవగాహన కల్పించనున్నారు. సోలార్‌ విక్రేతలు, బ్యాంకు ప్రతినిధులు పాల్గొంటారు. గృహ విద్యుత్‌ వినియోగదారులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు, ఆసక్తి ఉన్న ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.