Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత

Author
Posted By Telangana Gontuka
| 30 Sep 2026, 12:56 PM | ANDHRA PRADESH, Bhakti, INTERNATIONAL, NATIONAL, TELANGANA
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్‌ (77) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన గత పది రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ట్రస్టు ప్రతినిధి తెలిపారు. విజయకుమార్‌ నాయుడుగా జన్మించిన ఆయన ఆధ్యాత్మిక సాధన, మానవతా విలువలు, సేవాభావంపై భక్తులకు బోధనలు చేశారు. ఆయన పార్థివదేహాన్ని తిరుపతిలోని ఏకం క్షేత్రంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నట్లు ట్రస్టు తెలిపింది. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.