Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అభివృద్ధి నిధుల కోసం ఫ్లెక్సీతో నిరసన

Author
Posted By Telangana Gontuka
| 30 Sep 2026, 09:17 AM | TELANGANA
అభివృద్ధి నిధుల కోసం ఫ్లెక్సీతో నిరసన

జనగామ: గ్రామ సమస్యలు, అభివృద్ధి నిధులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరిని వడిచర్ల సర్పంచ్‌ కార్తీక్‌ ప్రశ్నించారు. లింగాలఘణపురం మండలంలోని కొత్తపల్లి, వనపర్తి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరైన సందర్భంగా కార్తీక్‌ ఆయనను కలిసి వడిచర్లలో నెలకొన్న సమస్యలను వివరించారు. గ్రామానికి అభివృద్ధి నిధులు ఎందుకు మంజూరు కావడం లేదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు ఎప్పుడు చేపడతారని ప్రశ్నించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించి, పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ మేరకు గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.