Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భద్రకాళి ఆలయం చుట్టూ మళ్లీ గిరిప్రదక్షిణ!

Author
Posted By Telangana Gontuka
| 30 Sep 2026, 07:10 AM | Bhakti, TELANGANA
భద్రకాళి ఆలయం చుట్టూ మళ్లీ గిరిప్రదక్షిణ!

వరంగల్‌: భద్రకాళి అమ్మవారి ఆలయం చుట్టూ మూడు దశాబ్దాల క్రితం కొనసాగిన గిరిప్రదక్షిణ సంప్రదాయాన్ని ఈ ఏడాది పునరుద్ధరించేందుకు అధికారులు, అర్చకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆలయ గుట్ట చుట్టూ నిర్మాణాలతో కాలక్రమంలో ఈ ఆచారం కనుమరుగైంది. ప్రస్తుతం నవరాత్రుల్లో వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, అమ్మవారికి మొక్కుగా తొమ్మిది రోజుల పాటు గిరిప్రదక్షిణ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పురాణాల్లో గిరిప్రదక్షిణకు విశిష్టత ఉందని అర్చకులు పేర్కొంటున్నారు.