Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామికి విశేష పూజలు

Author
Posted By Telangana Gontuka
| 30 Sep 2026, 07:08 AM | TELANGANA
నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామికి విశేష పూజలు

గీసుగొండ: మండలంలోని ఊకల్‌ ప్రసిద్ధ నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో భాద్రపద మాస విశేష పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. జిల్లా జడ్జి నిర్మల గీతాంబ, సీఐ విశ్వేశ్వర్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. అక్టోబర్‌ 2 వరకు దీక్షా మాలధారణలు ఉంటాయని, 41 రోజుల పాటు దీక్షలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు.