Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ వర్క్‌షాప్

Author
Posted By satla anil kumar
| 29 Sep 2026, 05:21 PM | TELANGANA
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ వర్క్‌షాప్

వరంగల్: హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక వర్క్‌షాప్‌లో వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంట రవికుమార్, అసెంబ్లీ కన్వీనర్లు, కో-కన్వీనర్లు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం పలు సూచనలు చేసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమన్వయంతో ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసి, పార్టీకి మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తామని గంట రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్‌షా తదితరులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ వర్క్‌షాప్ - Additional Image